Monday, November 27, 2006

తొలకరి బ్లాగు జల్లు

ఇదే నా తొలి కవిత ... 
తొలకరి వానలా.. 
అప్పుడు వచ్చె పుడమి వాసనలా మండు వేసవిలొ చలివేద్రంలా... 
చలి కాలంలొ వెచ్చని కంబళిలా.. 
 పురివిప్పిన నెమలి పింఛంలా... 
పైట వేసిన కన్నె పిల్లలా... 
గాలివానకు వచ్చె సెలవలా.. 
 పులిహారలొ కమ్మని జీదిపప్పులా.. 
గొంగూర పచ్చడిలొ ఉల్లిపాయల.. 
వర్షం రోజున అమ్మ చేసె మిరప బజ్జిలా.. 
 అందరికి తెలుగు కమ్మదనాన్ని పంచి..
 నాలోని ఈ కవితా జీవి అనువనువు ఎదిగి ఇంతై ఇంతింతై మన తెలుగు వీనకు ఒక మేటి స్వరమవ్వాలి...

3 comments:

రానారె said...

చాలా బాగుంది. అచ్చు తప్పులున్నాయి, సరిదిద్దితే మరింత బాగుంటుంది కదా.

Sudhakar said...

సుస్వాగతం :-)

Raghu said...

ఈ బ్లాగ్లోకానికి స్వాగతము...

మీ కవిత మా అమ్మ చేసే వంటకాలు గుర్తు చేసింది...