Monday, November 27, 2006

తొలకరి బ్లాగు జల్లు

ఇదే నా తొలి కవిత ... 
తొలకరి వానలా.. 
అప్పుడు వచ్చె పుడమి వాసనలా మండు వేసవిలొ చలివేద్రంలా... 
చలి కాలంలొ వెచ్చని కంబళిలా.. 
 పురివిప్పిన నెమలి పింఛంలా... 
పైట వేసిన కన్నె పిల్లలా... 
గాలివానకు వచ్చె సెలవలా.. 
 పులిహారలొ కమ్మని జీదిపప్పులా.. 
గొంగూర పచ్చడిలొ ఉల్లిపాయల.. 
వర్షం రోజున అమ్మ చేసె మిరప బజ్జిలా.. 
 అందరికి తెలుగు కమ్మదనాన్ని పంచి..
 నాలోని ఈ కవితా జీవి అనువనువు ఎదిగి ఇంతై ఇంతింతై మన తెలుగు వీనకు ఒక మేటి స్వరమవ్వాలి...